మిర్యాలగూడ టౌన్ : దామరచర్ల మండల కేంద్రం సమీపంలో గల వరి చేలను కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు. అనంతరం రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరులో మోగి పురుగులు, నల్లి, తామర పురుగుల ఉత్పత్తి అధికంగా ఉందన్నారు. వీటి నివారణకు ప్లూబెండమేడ్ 39.35 ద్రావణం ఎకరానికి 20 మిల్లీ లీటర్లు, స్పైరోమేసిఫిన్ 200 మిల్లీ లీటర్లతో పిచికారి చేసుకోవాలన్నారు. శాస్త్రవేత్తల వెంట ఏఈఓ రావుల నరేష్, పీఏసీఎస్ సీఈఓ వెంకట్‌రెడ్డి, రైతు సైదిరెడ్డి తదితరులున్నారు.
ఈయూ కూటమిని గెలిపించాలి
దేవరకొండ : ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కూటమిని గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఈయూ గౌరవాధ్యక్షుడు పల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. దేవరకొండ డిపో వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కార్మికులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, రహీమొద్దీన్, తూం బుచ్చిరెడ్డి, కేఎస్ రెడ్డి, వెంకటయ్య, మంగ, జమాల్‌గౌడ్, రాజు, డి.వి. నారాయణ, రాఘవరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ముగిసిన శిక్షణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌పై నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ శనివారం ముగిసింది. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్, ఐబీఎం సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐబీఎం ప్రాజెక్టు మేనేజర్ సాయి రాఘవేంద్ర, శిక్షకురాలు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఏఐ టూల్స్ సహాయంతో ఉద్యోగాలు సాధించేలా ప్రాజెక్టులను సిద్ధం చేసుకోవడం, ప్రతిభను చాటేలా రెజ్యుమ్ డిజైన్ చేయడం, రోజువారీ విద్యలో చాట్ జీపీటీ, జెమిని ఏఐలను నైపుణ్యంతో ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సాంకేతిక రంగానికి కృత్రిమ మేధస్సే కీలకమని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ హెచ్‌ఓడీ శ్రీనివాస్‌రెడ్డి, కంప్యూటర్ సైన్ హెచ్‌ఓడీ ఎస్‌పి.వెంకటరమణ, అధ్యాపకులు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, నగేష్, కిరణ్, రమ్య, రాణి, తులసి, శశికళ, రామ, సంధ్య, పద్మావతి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.


