బొట్టుగూడ విద్యార్థులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

బొట్టుగూడ విద్యార్థులకు అభినందనలు

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

రామగిరి (నల్లగొండ) : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిచన మహాత్మాగాంధీ 157వ జయంతి ఉత్సవాల్లో నల్లగొండ బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్‌ పౌండేషన్‌ పాఠశాల విద్యార్థులు ఫ్యాషన్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, వివేక్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, హనుమంతరావు, కొందండరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు గాంధీజ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌ గున్న రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాలా ప్రభాకర్‌రెడ్డి, కన్వీనర్‌ గాంధారి ప్రభాకర్‌, నీరుడు దయాకర్‌ రెడ్డి, బొమ్మపాల గిరిబాబు, కరుణాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement