సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

మిర్యాలగూడ : దేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని, అదే స్ఫూర్తితో ప్రస్తుత రైతాంగ సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత 36వ రైతు మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో కార్మికులతో ఆయన సమావేశమమై మాట్లాడుతూ.. నల్లగొండ గడ్డ ఎన్నో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. రైతాంగ ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ మహాసభలు వేదికగా నిలుస్తాయన్నారు. రైతుల సమస్యలు కేవలం వారికే పరిమితం కాదని, వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. మహాసభల విజయవంతం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు అందించి, ప్రచార కార్యక్రమాల్లో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, నంద్యాల వేణుధర్‌రెడ్డి, బద్యానాయక్‌, ధనావత్‌ భాగ్యనాయక్‌, రెడ్యనాయక్‌, అజ్మీరా హుష్యా, బాలు తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement