బస్సు డిపో గ్యారేజీలో స్వల్ప అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బస్సు డిపో గ్యారేజీలో స్వల్ప అగ్నిప్రమాదం

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆదివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గ్యారేజీలో బస్సు మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో డిపో ప్రాంగణంలో కలకలం రేగింది. అయితే, అక్కడే ఉన్న గ్యారేజీ సిబ్బంది వెంటనే తేరుకుని గారేజీలో ఉన్న ఫైర్‌ సేఫ్టీ యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పారు. సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష

మునగాల: మండల కేంద్రంలోని జాతీయ రహదారి–65పై గల యూటర్న్‌ వద్ద ఈనెల 25న పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడిన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ పెద్దపోగు అవినాష్‌ను సోమవారం కోదాడ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోదాడ స్పెషల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎండి.ఉమర్‌ సదరు లారీ డ్రైవర్‌కు ఒక్కరోజు జైలుశిక్ష, రూ.రెండువేల జరిమానా విధించినట్లు మునగాల ఎస్‌ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement