ఏసీబీకి చిక్కిన నాంపల్లి ఆర్‌ఐ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన నాంపల్లి ఆర్‌ఐ

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

నాంపల్లి: నాంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న రాలబండ గోపరాజు సోమవారం ఓ రైతు నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ జగదీష్‌ చందర్‌ వెల్లడించారు. నాంపల్లి మండలంలోని ఓ రైతు ఫౌతి చేయించేందుకు నాంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా పనిచేస్తున్న గోపరాజు వద్దకు రాగా ఆయన రూ.20వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో రూ.15వేలు ఇస్తానని సదరు రైతు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సోమవారం విధులు ముగించుకొని హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచి సమీపంలో ఆర్‌ఐ గోపరాజు అసిస్టెంట్‌ అయిన ప్రైవేటు వ్యక్తి యాదగిరికి సదరు రైతు రూ.15 వేలు అందజేశారు. అనంతరం యాదగిరి చేతుల నుంచి ఆర్‌ఐ గోపరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితులను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పూర్తిస్థాయిలో విచారించారు. ఆర్‌ఐ గోపరాజుపై ఏ–1, ప్రవేట్‌ వ్యక్తి అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎదుల యాదగిరిపై ఏ–2గా కేసు నమోదు చేశారు. రాత్రి కావడంతో నిందితులను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్‌ చందర్‌ తెలిపారు. అయితే ఆర్‌ఐ గోపరాజు ఉంటున్న ఎల్బీ నగర్‌లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు రైడ్‌ చేసినట్టు తెలిసింది.

రూ.15వేల లంచం తీసుకుంటూ

పట్టుబడిన గోపరాజు

ఆర్‌ఐతోపాటు అతడి

అసిస్టెంట్‌పైనా కేసు నమోదు

చర్లపల్లి జైలుకు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement