చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట నుంచి ఖైతాపురం మధ్య సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. దండుమల్కాపురం గ్రామం వద్ద రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తూప్రాన్‌పేట నుంచి ఖైతాపురం వరకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎగువ భాగంగా నెలకొన్న వాహనాల రద్దీ ప్రభావం దిగువన ఉన్న పట్టణ కేంద్రంపైనా చూపింది.


