మున్సిపల్‌ ఎన్నికల కోసమే ఆర్బాటాలు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల కోసమే ఆర్బాటాలు

Jul 30 2026 5:12 AM | Updated on Jul 30 2026 5:12 AM

నకిరేకల్‌ : నకిరేకల్‌ మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామంటు ప్రభుత్వం ఆర్బాటం చేస్తోందని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నకిరేకల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండగ సందర్భంగా గతేడాది వచ్చిన చీరలను నకిరేకల్‌లో ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని.. అవీ కూడా కేవలం సమబావన సంఘాల మహిళలకు యూనిఫాం మాదిరిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అంతటా ఇందిరమ్మ ఇళ్లు వస్తే నకిరేకల్‌ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తన హయాంలో 100 పడకల వైద్యశాల భవనాన్ని పూర్తిచేస్తే ప్రజలకు అందుబాటులోకి తేవడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అమృత్‌ స్కీం కింద గతంలో నిధులు తేస్తే.. ఆ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారన్నారు. చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతుంటే.. కనీసం వాటిని నింపాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. సమావేశంలో మార్కెట్‌ మాజీ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, గుండగోని జంగయ్యగౌడ్‌, పేర్ల క్రిష్ణకాంత్‌, పెండెం సదానందం, గుర్రం గణేష్‌, పల్లె విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement