ఉద్యమకారుల ఎంపికను ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల ఎంపికను ప్రారంభించాలి

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ.. ఉద్యమకారుల ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, దక్షిణ తెలంగాణ ఇన్‌చార్జి తోట నరసింహాచారి, రాష్ట్ర కార్యదర్శి కర్ణ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్లగొండలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, చర్చలు, సమావేశాల పేరిట కాలయాపన చేస్తోందన్నారు. టీయూఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరికొండ మధు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తలారి యాదగిరి, చెంగలి జంగయ్య, రేకల భిక్షం, ప్రకాష్‌, కట్ట శ్రీనివాస్‌, చంద్రయ్య, కత్తుల దాస్‌, శ్రీనివాస్‌, కృష్ణ, నగేష్‌, అప్పారావు, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement