సబ్‌స్టేషన్లను ఆధునీకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్లను ఆధునీకరిస్తాం

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

నిడమనూరు : విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి సబ్‌స్టేషన్‌లో సోమవారం ఆయన రికార్డులను, బ్రేకర్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందన్నారు. కొత్తగా తుమ్మడం సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిచామని, స్థలం కేటాయిస్తే, వెంటనే నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో రైతుల నుంచి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట డీఈ శ్రీనివాస్‌చారి, సబ్‌ ఇంజనీర్‌ కృష్ణారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement