కాన్పుకెళ్తే కోతే.. | - | Sakshi
Sakshi News home page

కాన్పుకెళ్తే కోతే..

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

ఐదేళ్లలో ప్రసవాల వివరాలు ఇలా..

సంవత్సరం ఆసుపత్రి సిజేరియన్‌ సాధారణం

2022–23 ప్రభుత్వ 7877 5714

ప్రైవేటు 8234 1846

2023–24 ప్రభుత్వ 6195 6025

ప్రైవేటు 7904 1723

2024–25 ప్రభుత్వ 5505 5071

ప్రైవేటు 7938 1812

2025–26 ప్రభుత్వ 5760 4309

ప్రైవేటు 7763 1652

2026–27 ప్రభుత్వ 1592 1228

(ఇప్పటివరకు) ప్రైవేటు 1696 317

నల్లగొండ టౌన్‌ : జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నప్పటికీ సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యుల నిర్లక్ష్య వైఖరితో పాటు త్వరగా పని ముగించాలనే ధోరణితో సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా.. సిజేరియన్లనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రైవేట్‌లో ఇష్టారాజ్యం..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోపంతో పాటు ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన మాస్‌ మీడియా విభాగం ఉన్నప్పటికీ జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రైవేట ఆసుపత్రుల్లో సాధారణ కాన్పుకై తే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు, సిజేరియన్‌ చేస్తే రూ.60 వేల వరకు బిల్లులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులు అయితే బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు దంపతులు తమ బిడ్డ మంచి ముహూర్తాల్లో జన్మించాలని, ఇంకొందరు పురిటి నొప్పులు భరించలేరనే భావంతో ఉండడం ప్రైవేట్‌ ఆసుపత్రులకు కలిసి వస్తోంది. బిడ్డ ఉమ్మ నీరు తాగి ప్రాణా పాయ స్తితిలో ఉన్నప్పుడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సీజేరియన్‌ చేయాలనే నిబంధనలు ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. సీజేరియన్‌ వల్ల తల్లి ఆరో గ్యం త్వరగా దెబ్బతినడమే గాక బిడ్డపై ప్రభావం పడుతుందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు.

ఫ సిజేరియన్లకే వైద్యుల మొగ్గు

ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అదే తీరు

ఫ తగ్గిన సాధారణ ప్రసవాలు

ఆసుపత్రులలో తప్పనిసరిగా సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలి. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌ చేస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.

– డాక్టర్‌ కె.రాహుల్‌, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement