నిడమనూరు : నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వ మరమ్మతులు అసంపూర్తిగా చేపడుతున్నారు. కాల్వ నిర్మాణ సమయంలో చేపట్టిన బండల లైనింగ్ తొలగించి.. 2014 సీసీ లైనింగ్ చేపట్టినా.. అక్కడక్కడా అసంపూర్తిగా వదిలేశారు. ఆ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ఏడాదిక్రితం టెండర్లు ఖరారు చేసి.. రెండు వారాలుగా పనులు ప్రారంభించారు. రూ.54 కోట్లతో సాగర్ మొదటి జోన్ (72కిలోమీటర్లు)పరిధిలో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్‌మరోసారి అసంపూర్తిగా పనులు చేపడుతున్నారని రైతులు అంటున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కాల్వ సీసీ పనులు పర్యవేక్షించాల్సిన ఎన్‌ఎస్పీ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల బండల లైనింగ్ అలాగే వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ 38 కిలోమీటరు ప్రాంతం(బొకమంతలపహాడ్ – ముకుందాపురం) గ్రామాల వద్ద కిలోమీటర్ మేర బండల లైనింగ్ ఉంది. ఇక్కడ సాగర్ కాల్వ భూ ఉపరితలానికి దిగువన ఉండటంతో ఎటువంటి ప్రమాదం ఉండదని.. పాతబండల లైనింగ్ ఉంచుతున్నట్లు కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి. టెండరు ప్రకారం కాల్వ పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టరు పాత లైనింగ్‌ను పలుచోట్ల అలాగే ఉంచుతున్నారు. సీసీ లైనింగ్ లేకపోతే కాల్వ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ సాగర్ ప్రధాన కాల్వకు కొన్నిచోట్ల
బండల లైనింగ్ ఉంచుతున్న కాంట్రాక్టర్
ఫ పనులను పర్యవేక్షించని
ఎన్‌ఎస్పీ అధికారులు


