లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

చివ్వెంల (సూర్యాపేట) : న్యాయస్థానాల పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నెల 20న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కారం చూపుతారు. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, సత్వర న్యాయం కోసం న్యాయశాఖ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తోంది.

లోక్‌ అదాలత్‌ అంటే..

కోర్టుల్లో నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాటికి సత్వర పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్‌ అదాలత్‌ అనేది లీగల్‌ సెల్‌ అథారిటీస్‌ యాక్టు–1987 ప్రకారం చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది.

ఎలాంటి ఫీజు ఉండదు..

పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా న్యాయ స్థానాల్లో ప్రీలిటిగేషన్‌ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్‌ అదాలత్‌. ఈ చట్టం ప్రకారం లోక్‌ అదాలత్‌లు ఇచ్చే అవార్డు(నిర్ణయం) సివిల్‌ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులు మాత్రమే లోక్‌ అదాలత్‌ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. ఆ సంస్థ ఇచ్చే తీర్పు అంతిమం. కేసులు పరిష్కారమైనప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీల్‌ చేయడానికి అవకాశం ఉండదు. లోక్‌ అదాలత్‌ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అదే కోర్టులో కేసు వేస్తే పరిష్కారానికి సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. లోక్‌ అదాలత్‌ కేసులకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇరువర్గాల వారు రాజీ పడవచ్చు.

పరిష్కారమయ్యే కేసులు ఇవీ..

సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ వెహికల్‌ యాక్టులు, ఎకై ్సజ్‌ కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ ఘర్షణలు, యాక్సిడెంట్‌ తదితర కేసులను పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ పై కోర్టుల్లో అప్పీల్‌ లేకుండానే

కేసుల పరిష్కారం

ఫ రాజీ మార్గంతో డబ్బు, సమయం ఆదా

ఫ 20న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement