నల్లగొండ : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్రైమ్ ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచిన కేసు సంబంధిత వస్తువులు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాలను శాసీ్త్రయ పద్ధతిలో భద్రపరచాలని తెలిపారు. అనంతరం పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్‌బీ సీఐ ఆదిరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, టూటౌన్ ఎస్‌ఐ సైదులు ఉన్నారు.


