ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తాం

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

మునుగోడు : రానున్న ఐదేళ్లలో మునుగోడు మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని డీసీసీబీ మాజీచైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. రూ.7.5కోట్ల నిధులతో బి.వెల్లెంల ఉదయ సముద్రం నుంచి మండలంలోని పులిపలుపుల, కల్వలపల్లి గ్రామాలకు సాగు నీరు అందించే కాల్వ నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు మండలంలోని చెరువులన్నీ నింపి రైతుల కళ్లల్లో ఆనందం నింపేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే కిష్టాపురం చెరువు వరకు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో చండూరు మార్కెట్‌ చైర్మన్‌ దోటి నారా యణ, బీరెల్లిగూడెం, పులిపలుపుల, గంగోనిగూడెం సర్పంచ్‌లు దాసరి గోవర్ధన్‌, కమ్మంపాటి జ్యోతివెంకటేశ్వర్లు, గోపగోని పాపయ్యగౌడ్‌, బొల్గూరి నర్సింహ, సయ్యద్‌, ముక్తార్‌, పాష పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement