కొండమల్లేపల్లి : వర్షాకాలంలో చేపట్టే వన మహోత్సవానికి మొక్కలు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. కొండమల్లేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకంపై నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడవల్లి, దేవరోనితండా గ్రామ పంచాయతీల్లోని వన నర్సరీలో మట్టినింపిన సంచుల్లో గింజలు పెట్టినా మొలకెత్తలేదు. వాటిల్లో మళ్లీ గింజలు పెట్టాల్సి ఉన్నా అలాగే వదిలేశారు. మరికొన్ని కవర్లలో మట్టినింపి ఖాళీగా ఉంచారు. గుమ్మడవల్లి గ్రామ పంచాయతీకి, దేవరోనితండా కార్యదర్శి ఇన్‌చార్జిగా ఉండడం వల్ల ఈ రెండు నర్సరీలను నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలా తయారైందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.


