బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

రామగిరి (నల్లగొండ) : బక్రీద్‌ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక బందోబస్తు నిర్వహించనుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా ప్రాంగణాన్ని బుధవారం ఎస్పీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ సౌకర్యాలు, తాగునీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులకు, ఈద్గాను శుభ్రం చేస్తున్న మున్సిపల్‌ వర్కర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్‌బీ సీఐ ఆదిరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ హఫీజ్‌ ఖాన్‌, నీలగిరి నగర మున్సిపల్‌ డిప్యూటీ మేయర్‌ అమేర్‌, వివిధ డివిజన్ల కార్పొరేటర్స్‌, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలోని ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తదితరులు

ముస్తాబైన మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణం

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement