కార్మికుల భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల భద్రతకు ప్రాధాన్యం

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

నల్లగొండ : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌, జిల్లా సంక్షోభ కమిటీ చైర్మన్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సంక్షోభ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరిశ్రమల్లో ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రమాదాల సందర్భంగా ప్రాణ నష్టం జరగకుండా కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రతి శాఖ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల భద్రతలో భాగంగా ప్రతి కంపెనీ వారంలోగా సేఫ్టీ ఆడిట్‌ నివేదికలను సమర్పించాలన్నారు. వైటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ విజయకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీదేవి పలు విషయాలను వివరించారు. సమావేశంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ దామోదర్‌ సింగ్‌, ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నాగన్న, దుర్గాప్రసాద్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

6.96లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నాం

యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు రూ.1,663 కోట్ల విలువ చేసే 6,96,218 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ఇంకా 46,312 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, పౌరసరఫరాల డీఎం రాంపతి నాయక్‌, డీఎస్‌ఓ వెంకటేశం, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement