ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

చిట్యాల : చిట్యాల పట్టణంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రెండో వార్డులో కురిసిన రాళ్ల వర్షానికి కూనూరు గాలమ్మ ఇంటి పైకప్పు రేకులు, పైపులు విద్యుత్‌ స్తంభాలపై పడడంతో వైర్లు తెగాయి. ఓ వేప చెట్టు విరిగి పడింది. దీంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండో వార్డుకే చెందిన వనం రేణుక, చింతపల్లి నరేష్‌, దండుగల లక్ష్మమ్మ ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. కోనేటి యాదయ్య స్లాబ్‌ చుట్టూ ఉన్న కంటే గోడ కూలి ట్రాక్టర్‌ మీద పడటంతో ఆస్తి నష్టం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement