కరెంట్‌ కోతలు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలు లేకుండా చూడాలి

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

నల్లగొండ టూటౌన్‌ : మండుతున్న ఎండలకు నీలగిరిలో ఏసీల వినియోగం పెరిగి తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అయి కరెంట్‌ పోతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు త్వరగా మంజూరు చేయించి విద్యుత్‌ కోతల సమస్యను వెంటనే పరిష్కరించాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం నీలగిరి మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తారు. 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేసాని వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కరెంట్‌ కోతలతో తాగునీటి సమస్య ఏర్పడుతోందని, రూ.10 లక్షల వ్యయంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మేయర్‌ను కోరారు. 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ మారగోని భవాని మాట్లాడుతూ వేలాడుతున్న కరెంట్‌ వైర్లతో మంటలు వస్తున్నాయని, పాత వైర్లు తొలగించి కొత్తవి అమర్చేలా చూడాలన్నారు. సెయింట్‌ ఆల్ఫన్సెస్‌ స్కూల్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇబ్రహీం మాట్లాడుతూ నగరంలోని వివిధ కాలనీల్లో పాత స్తంభాలు తొలగించి ఎత్తైన స్తంభాలు పాతాలన్నారు. 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ రేగట్టే అండాలు లింగస్వామి మాట్లాడుతూ డివిజన్‌లో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, వాటిని నియంత్రించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

కొత్త స్తంభాలు ఏర్పాటు చేయిస్తాం..

అనంతరం నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కరెంట్‌ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్‌ వైర్లు, కొత్త స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎజెండా అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటి మేయర్‌ అశ్రఫ్‌ అలీ (అమేర్‌), మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర, ఈఈ రాములు, కార్పొరేటర్లు మారగోని నవీన్‌గౌడ్‌, అల్లి సుభాష్‌యాదవ్‌, గోగుల గణేష్‌, దాసరి సాయి, అబ్బగోని కవిత, గుమ్ముల జానకి మోహన్‌రెడ్డి, పెరిక స్వాతి, యామ కవిత, గంట్ల అనంతరెడ్డి పాల్గొన్నారు.

ఫ ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య పెంచాలి

ఫ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో కార్పొరేటర్ల విజ్ఞప్తి

ఫ సమస్యను పరిష్కరిస్తామన్న మేయర్‌ బుర్రి చైతన్య

Advertisement
 
Advertisement
Advertisement