అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని ధర్నా

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

మిర్యాలగూడ టౌన్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ మున్సి పల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ డీఈఈ వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన పేదల కోసం 565 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి డ్రా పద్ధతిలోనే కేటాయించి, ఇప్పుడు కేవలం 332 మందికే ఇళ్లు ఇస్తామనడం విడ్డురంగా ఉందన్నారు. మిగిలిన ఇళ్లను అధికార పార్టీ వారికి కేటాయించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్లు అందించాలని, పట్టణంలో ఇబ్బందిగా నిర్మించిన డివైడర్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు యడవల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నబిమోజు నాగార్జునాచారి, ఎండి మగ్ధూం, కౌన్సిలర్లు ఎండి ఇలియాస్‌, పెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, గడ్డం దీపిక, గుడిసె జానకమ్మ, లావూరి అరుణ, సందేశి రజని, సునిత, యరమళ్ల దీనేష్‌, లక్ష్మి, సీత, భిక్షం, అంజిబాబు, తిరుమలగిరి వజ్రం, షోయబర్‌, కోటేశ్వర్‌రావు, భూక్య రాంబాబు, ఆంజనేయరాజు, తిరుపతిరావు, ఈశ్వరాచారి, వినోద్‌, శ్రవణ్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, దైద సత్యం, మస్తాన్‌, వెంకటేష్‌, రామస్వామి, లక్ష్మీనారాయణ, మురళిచారి, అఖిల్‌నాయక్‌, రామావతారం, ఫయిజ్‌, రమేష్‌చారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement