నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ప్రజలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం సాగర్ డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఈఈ సీతీరాంకునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ రమేశ్‌జీ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్రజలను అకస్మాత్తుగా ఖాళీచేయాలంటూ నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. 58,59 జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నివాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి సైదులు, మహ్మద్ ఘని, విజయ్, చంద్రమౌళినాయక్, కోడె విజయ్, ఆదాసు విక్రం, నరేష్, నజీర్, షరీఫ్, ఎస్‌కె.రఫీభాషా, శేఖరాచారి, లక్ష్మణ్‌నాయక్, కోదండం, ధార రవి తదితరులు పాల్గొన్నారు.


