వానాకాలానికి ఎరువులు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వానాకాలానికి ఎరువులు సిద్ధం

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

జూన్‌ నుంచి ఫర్టిలైజర్‌ యాప్‌

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలో వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత యాసంగిలో రైతులకు ఎదురైన సమస్యలు వానాకాలంలో పునరావృతంగా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని పలు సంస్థల వద్ద యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్‌ ఎరువులను అందుబాటులో ఉంచారు. వేర్‌హౌసింగ్‌ గోదాములు, హోల్‌సేల్‌ డీలర్లు, రిటైల్‌ డీలర్ల వద్ద 66,938 మెట్రిక్‌ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచారు.

ఎరువుల కోసం ఇండెంట్‌..

రానున్న వానాకాలం సీజన్‌లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో పత్తి 5,3,524 ఎకరాలు, వరి 5,86,137, కంది 14,000, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న, పెసర 7,000, వేరుశనగ ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నట్లు అంచనాలు వేసింది. దీనికి అవసరంగా యూరియా 1.61 లక్షల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 61,342 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 33,758 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 12,932 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 1,14,043 మెట్రిక్‌ టన్నులు అవసరంగా అంచనాలు వేసి గత నెలక్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఇండెంట్‌ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రావాల్సిన ఎరువులను జూన్‌ మొదటి వారం నుంచి నెలనెలా రైతుల అవసరం మేరకు సరఫరా చేయనుంది. సీజన్‌ ముగిసే వరకు ప్రతి నెలాపంపించనుంది.

ఫ గత యాసంగి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు సన్నాహాలు

ఫ ప్రస్తుతం అందుబాటులో 66,938 మెట్రిక్‌ టన్నులు ఎరువులు

అందుబాటులో ఉన్న

ఎరువులు ఇలా..

ఎరువు మెట్రిక్‌ టన్నులు

యూరియా 30,023

డీఏపీ 3,238

ఎంఓపీ 2593

ఎన్‌పీకేఎస్‌ 29087

ఎస్‌ఎస్‌పీ 1863

యూరియా కోసం రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌ను జూన్‌ మొదటి వారంలో రైతులకు అందుబాటులో ఉంచనున్నాం. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరం మేరకు మాత్రమే వాడాలి. అధిక మోతాదులో వాడితే నష్టం తప్ప లాభం లేదు. ఇప్పటికే నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాం. రైతులు నానో యూరియాను వాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. – పాల్వాయి శ్రవణ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
 
Advertisement
Advertisement