నల్లగొండ టూటౌన్ : యువ ఆపదమిత్రలు గ్రామాల్లో సేవలు అందించాలని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో యువ ఆపదమిత్రలకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. 31వ బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని విపత్తు నిర్వహణకు సంబంధించిన సైద్దాంతిక, ప్రాక్టికల్ శిక్షణ పొందారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఇంజరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రేఖ, శశిధర్‌రావు, మాధవరావు, మల్లయ్య, ఆశిష్ కుమార్, యూసుఫుద్దీన్, మచ్చేందర్, రాము, సీటీఓ నాగు నాయక్ పాల్గొన్నారు.


