బ్యాడ్మింటన్‌ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ జిల్లా జట్ల ఎంపిక

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

మిర్యాలగూడ టౌన్‌ : మిర్యాలగూడ పట్టణంలోని క్లీయో స్పోర్ట్స్‌లో బ్యాడ్మింటన్‌ జిల్లా జట్లను సోమవారం ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. అండర్‌–11 విభాగంలో అన్షు శ్రీయన్‌, విదురు కృష్ణారెడ్డి, భవ్యన్షి, ఆరాధ్య, సంజన, అండర్‌ –13 విభాగంలో దీపక్‌నాయుడు, అద్వైత్‌రెడ్డి, కుషల్‌, శ్రయన్‌, సహాస్రార్షిత, చైత్రరెడ్డి, లోహిత, మనస్వీ, అండర్‌ –17 విభాగంలో అక్షిత్‌రెడ్డి, అభినవ్‌, చాణిక్య, చందన, రిదాహష్మి, శ్రీచైత్ర, యశస్విని, మసాదిక్‌ అలీ, అండర్‌–19 విభాగంలో అన్విత్‌ నిీహాల్‌రెడ్డి, అభినవ్‌, రోహిత్‌సాయి, వంశీ, తేజస్విని, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగంలో ప్రణిత్‌, అన్వీత్‌ నిహాల్‌రెడ్డి, చందన, పూజిత ఎంపికై నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ జి.అంజయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ప్రశాంత్‌, నవీన్‌కుమార్‌ తెలిపారు. జిల్లా జట్లల్లో ప్రతిభను కనబరిచిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధుబాబు, సికిందర్‌రెడ్డి, గంజి శ్రీనివాస్‌, జిల్లా కోచ్‌ రామకృష్ణ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement