157 మంది జెడ్పీ ఉద్యోగుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

157 మంది జెడ్పీ ఉద్యోగుల బదిలీ

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

నల్లగొండ : జిల్లా పరిషత్‌లో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన 157 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్‌ ద్వారా ఆదివారం బదిలీలు నిర్వహించి పోస్టింగ్‌ ఇచ్చారు. ఉద్యోగుల సీనియారిటీ, ఖాళీల ఆధారంగా కౌన్సిలింగ్‌ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో 39 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 22 మంది రికార్డు అసిస్టెంట్లు, 9 మంది టైపిస్టులు, 79 మంది అటెండర్లు, 8 మంది నైట్‌వాచ్‌మెన్లను ఖాళీల ఆధారంగా కోరుకున్న చోట బదిలీ చేశారు. కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సిలింగ్‌లో జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement