పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

పచ్చిరొట్ట ఎరువులను

రైతులు విరివిగా వాడాలి

నల్లగొండ అగ్రికల్చర్‌ : వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు కావాల్సిన జీలుగ, జనుము విత్తనాలను మిర్యాలగూడ పరిధిలోని నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీకి సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్‌ కేంద్రాలు, రైతు పరస్పర సెంటర్లలో జీలుగ 3,500 క్వింటాళ్లు, జనుము 500 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. ఈ విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు.

పచ్చిరొట్టతో ప్రయోజనాలు

పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. అధిక దిగుబడులు రావడంతోపాటు పెట్టుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నేలలో సేంద్రియ పదార్థం పెరగడంతోపాటు నైట్రోజన్‌ స్థాయి సహజంగా అధికమవుతోంది. ఈ ఎరువులు వాడిన భూమి గట్టిదనం తగ్గి మెత్తబడుతుంది. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యంగా తయారవుతుంది.

ధరలు ఇలా.. (కేజీ రూపాయల్లో..)

పంట కేజీ సబ్సిడీ రైతు వాటా

జీలుగ 163.50 81.85 81.75

జనుము 155.50 77.75 77.75

పచ్చిరొట్ట ఎరువుల వాకంతో రసాయన ఎరువుల అవసరం తగ్గి సాగు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర వ్యవసాయానికి దోహదపడనున్నాయి. రైతులు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయాధికారి

ఫ 50 శాతం సబ్సిడీపై

రైతులకు అందజేత

ఫ సహకార సంఘాలు, ఆగ్రోస్‌

సెంటర్‌లో అందుబాటులో విత్తనాలు

ఫ పంపిణీకి ఏర్పాట్లు చేసిన

విత్తనాభివృద్ధి సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement