ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దు

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

నకిరేకల్‌ : అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీష్‌రావు ఏమి చేయాలో అర్థంకాక ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వంపై నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం తగదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెలా ఖారులోగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఆదివారం నకిరేకల్‌లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తూనే ఉన్నామని తెలిపారు. కేవలం రాజకీయం చేయాలన్న ఆలోచనతో బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని అబద్ధాలు, తప్పుడు అంకెలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘సెలవు రోజుల్లో కూడా మా ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు చేస్తున్న విషయం నిజం కాదా’ అని ప్రశ్నించారు. ‘మీ హయాంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేశారని, మేము మాత్రం అలా చేయబోమని.. ప్రతి పక్షం ఉండాలి మా తప్పులు ఎత్తి చూపుతూనే ఉండాలి’ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇక్కడి ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గ వ్యాప్తంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్‌ నేత, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గుత్తా మంజులమాధవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నూక కిరణ్‌యాదవ్‌, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్‌, గాజుల సుకన్య, దాసరి వీరార్జున్‌రెడ్డి, కందాల భిక్షంరెడ్డి పాల్గొన్నారు.

ఫ భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement