నల్లగొండ టౌన్ : ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో ముదిరాజ్‌ల సింహావలోకనం సదస్సు నిర్వహించనున్నట్లు ఆ వేదిక నాయకుడు, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు సంబంధించి పిట్టల రవీందర్ రాసిన పుస్తకంతోపాటు, పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కేశబోయిన శంకర్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాల్య, పి.శంకర్, అజయ్, శివ పాల్గొన్నారు.


