ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటి వరకు కొనసాగుతోంది. డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది.
– కంచుకంట్ల వెంకన్న, అద్దె వాహనయజమాని
ప్రభుత్వం ఇచ్చే కార్ల అద్దె గిట్టుబాటు కావడం లేదు. ప్రస్తుతం డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి. మెయింటెనెన్స్ కష్టమైంది. మాకు రూపాయి మిగలడం లేదు. ప్రభుత్వం ఆలోచన చేసి మా బాదలు అర్థం చేసుకుని అద్దెలు పెంచాలి.
– శౌరి రాజు, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నల్లగొండ


