మెడికల్‌ షాపుల బంద్‌ సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపుల బంద్‌ సంపూర్ణం

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

నల్లగొండ టౌన్‌ : ఈ ఫార్మసీ విధానానికి వ్యతిరేకంగా మెడికల్‌ షాపుల యజమానులు చేపట్టిన బంద్‌ నల్లగొండలో బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఆన్‌లైన్‌లో మందుల విక్రయానికి వ్యతిరేకంగా మెడికల్‌ షాప్‌ల యజమానులు బంద్‌ చేపట్టినట్లు జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిలుకూరి పరమాత్మ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి చిలుకూరి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పోశం రఘుపతి, కార్యదర్శి వి.శ్రీనివాసులు, కోశాధికారి వెంకటేశ్వర్లు, సుధాకర్‌, నిరంజన్‌, పోల రమేష్‌, స్వామి, హరిప్రసాద్‌, జీవన్‌, నరేంద్ర, అనిల్‌, శ్రీహరి పాల్గొన్నారు.

మహిళా సంఘాలకు రుణాలివ్వాలి

తిప్పర్తి : మహిళా సంఘాలకు సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని సెర్ప్‌ డైరెక్టర్‌ నవీన్‌ అన్నారు. బుధవారం తిప్పర్తి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహిస్తున్న సీనియర్‌ పీఆర్‌పీ స్ట్రాటజీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండలంలోని 33సంఘ బంధాల అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. కొత్త సంఘాల ఏర్పాటు, జీవనోపాధి కల్పనపై పలు సూచనలు చేశారు. సీ్త్ర నిధి రుణాల బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెర్ప్‌ డీపీఎం కరుణాకర్‌, డీపీఎం రామలింగయ్య, ఏపీయం హరి తదితరులు పాల్గొన్నారు.

సాగర్‌లో టూరిజం హెరిటేజ్‌ వాక్‌

నాగార్జునసాగర్‌ : తెలంగాణ టూరిజం వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగార్జునసాగర్‌లో హెరిటేజ్‌ టూరిజం వాక్‌ నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక అధికారి మహ్మద్‌ అక్బర్‌అలీ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం విజయవిహార్‌ అతిథిగృహం ప్రాంగణంలో వాక్‌ చేశారు. జిల్లాలోని టూరిజం ప్రాంతాలకు సంబంధించిన బ్రోచర్‌లోని పలు ప్రాంతాలపై చర్చించారు. కార్యక్రమంలో టూరిజం గైడ్‌ సత్యనారాయణ, స్థానికులు నజీర్‌, అనిల్‌కుమార్‌, రాజగోపాల్‌, అడ్వకేట్‌ వినోద్‌కుమార్‌, మల్లికార్జున్‌, సిబ్బంది వెంకటస్వామి, అంజి, తులసి పాల్గొన్నారు.

నైపుణ్యాన్ని పెంచుకోవాలి

నకిరేకల్‌ : దివ్యాంగులు వ్యాపారాల్లో మెళకువలతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాలని డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ జిల్లా క్లస్టర్‌ మేనేజర్‌ బి.సాయితేజ కోరారు. ఆ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నకిరేకల్‌, నల్లగొండ మండాలకు చెందిన దివ్యాంగులకు స్వయం ఉపాధిపై శిక్షణ కార్యక్రమం బుధవారం నకిరేకల్‌లో నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న 29 మంది దివ్యాంగులకు వ్యాపార యూనిట్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 109 మంది దివ్యాంగులకు వ్యాపార యూనిట్లను మంజూరు చేశామని తెలిపారు. ఇలాంటి శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెర్ప్‌ కోఆర్టినేటర్‌ జిల్లా వెంకన్న, క్లస్టర్‌ కో ఆర్టినేటర్లు మణికంఠ, మహేష్‌, రవి, తండు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement