నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

పోలీస్‌స్టేషన్‌ వద్ద అగ్ని పమాదం
కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద జరిగిన అగ్నిపమాదంలో పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి.

- 8లో

నల్లగొండ : నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జిల్లాలో బుధవారం సగటున గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీలుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజు 39.2 డిగ్రీలుగా ఉంది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్‌లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రోడ్లన్నీ నిర్మానుష్యం

ఎండవేడిమి, వడగాలులకు తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రోడ్లపై జన సంచారం తగ్గింది. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా వాతావరణ చల్లబడడం లేదు. ఏసీలు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ జిల్లాలో కూడా పెరిగింది. గత సంవత్సరం మే 20వ తేదీన జిల్లాలో 608 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం కాగా.. ఈ నెల 19న 709 మెగావాట్లు విద్యుత్‌ వినియోగం నమోదైంది. బుధవారం 772 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. గత ఏడాది కంటే 164 మెగావాట్ల విద్యుత్‌ ఒక రోజులో ప్రజలు అధికంగా వినియోగించారు.

వాతావరణం

పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది

ఫ జిల్లాలో సగటున 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఫ కట్టంగూర్‌లో అత్యధికంగా 45.8 డిగ్రీలు

ఫ భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

Advertisement
 
Advertisement
Advertisement