గుర్రంపోడు : ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేలా నీటి సంరక్షణ కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం గుర్రంపోడు మండలంలోని పోచంపల్లి గ్రామంలో జల సంచయ్ జన భాగిదారి కార్యక్రమంలో భాగంగా రైతులు, ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. కందకాల తవ్వకాలు, వాలుకు అడ్డంగా అడ్డుకట్టలు, నీటి కొలనులపై అవగాహన కల్పించారు. కళాజాత ప్రదర్శనలో వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండెబోయిన కళావతి, ఎంపీడీఓ మహేష్, ఏపీఓ గోపాల్‌రెడ్డి, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.


