ఓటరు జాబితా సవరణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణకు సహకరించాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

నిడమనూరు : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌)కు రాజకీయ పక్షాలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ కోరారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం ఆయన నిడమనూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఓటరు మ్యాపింగ్‌ ఎలా చేపడతారో వివరించారు. బూత్‌ లెవల్‌ అధికారుల జాన్‌ 25 నుంచి వచ్చే నెల 24 వరకు ఇంటింటీ సర్వే చేపడతారని తెలిపారు. వచ్చేనెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, 1 అక్టోబరు 2026న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి ఓటరు జాబితాలో సవరణకు సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జంగాల కృష్ణయ్య, అనిల్‌కుమార్‌, చందర్‌రావు, శ్రీనివాస్‌, గాజుల ప్రమీల, కరుణశ్రీ, బాణోతు ఖాసీం, మార్కెట్‌ చైర్మన్‌ అంకతి సత్యం, ఎడవెల్లి వల్లభారెడ్డి, రామలింగయ్య, కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
Advertisement