‘సర్‌’ను పారదర్శకంగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను పారదర్శకంగా పూర్తిచేయాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

నల్లగొండ : ఓటరు జాబితా సమ గ్ర సవరణ ప్రక్రియను (సర్‌) పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ఆయన తన ఛాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుతం ఆ ఓటర్ల పరిస్థితి, 2002 తర్వాత కొత్తగా జాబితాలో చేరిన వారి అంశాలను పరిశీలిస్తూ 2026 ఓటరు మ్యాపింగ్‌ చేపట్టాలని తెలిపారు. ఇప్పటివరకు 80.65 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 1,575 మంది బీఎల్‌ఓలను నియమించామని, సర్‌ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ 2 ఫారాలు అందజేస్తామని, ఓటర్లు ఒక దానిని పూరించి సమర్పించాలని చెప్పారు. ఓటరు జాబితాకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారిని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement