నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడగా 60 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం లెచ్చించారు. మొత్తం రూ.44,16,666 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు తెలిపారు. అన్నదానం హుండీని లెక్కించగా రూ.18,642 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వరాల రమేష్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, ధర్మకర్తలు మల్లేషం, సంపత్, యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి, లింగస్వామి, శ్రీను, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, నరేష్, మహేందర్‌రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.


