హీట్‌ స్ట్రోక్‌ వార్డులు | - | Sakshi
Sakshi News home page

హీట్‌ స్ట్రోక్‌ వార్డులు

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

నల్లగొండ టౌన్‌ : రానున్న నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బ బారిన పడిన వారికి ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి ముందస్తుగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌, మర్రిగూడ ఏరియా ఆస్పత్రులతో పాటు 24 గంటల పీహెచ్‌సీల్లో ప్రత్యేకంగా హీట్‌స్ట్రోక్‌ వార్డులను ఏర్పాటు చేశారు. అందులో వైద్యులతో పాటు ఏఎన్‌ఎంలు 24 గంటలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వడదెబ్బ బారిని పడితే అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు.

సిద్ధంగా మందులు, గ్లూకోజ్‌ బాటిళ్లు..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు జీజీహెచ్‌, ఏరియా ఆస్పత్రుల అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధిహామీ పథకం పనులు చేసే ప్రాంతాలలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పీహెచ్‌సీల్లో ఓపీ సేవల కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా లీటర్‌ నీటిలో ఒక ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ను కలిపి దాహం వేసిన వారికి అందించనున్నారు. ఎండల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా వారికి ఈ ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య ఽశాఖ చేసింది. వేసవిలో వచ్చే జబ్బులకు సంబంధించిన మందులను, గ్లూకోజ్‌ బాటిళ్లను అన్ని ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోజువారి సమాచారాన్ని తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలను జారీ చేశారు.

జీజీహెచ్‌, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు

ఫ 24 గంటలు అందుబాటులో వైద్యులు, సిబ్బంది

ఫ రెడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

Advertisement
 
Advertisement
Advertisement