పెద్దఅడిశర్లపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం లారీ కాంట్రాక్టర్, పీఏసీఎస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి కావాల్సిన లారీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని లారీ కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, పీఏసీఎస్ సీఈవో ప్రభాకర్, సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు.
హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మంగళవారం పలు హోటళ్లు, బేకరిలు, స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కొంతమంది వ్యాపారులు మాంసాహార పదార్థాలను సరైన లేబులింగ్ లేకుండా, ‘యూజ్ బై డేట్’ నమోదు చేయకుండా ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. బేకరీల్లో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు, సాస్‌లు ఇతర ఆహార పదార్థాలతో కలిపి నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. డీవీకే రోడ్డులోని ఒక కేఫేలో టీ తయారీలో రంగులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా గుర్తించిన టీ పొడి, చక్కెర నమూనాలను ప్రయోగశాలకు పంపారు. తనిఖీలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.శివశంకర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌డబ్ల్యూ టెక్నీషియన్ ఎం.వెంకటపతి, డ్రైవర్ పి.వంశీ పాల్గొన్నారు.
చెక్‌పోస్ట్‌ల వద్ద
పటిష్ట నిఘా అవసరం
నల్లగొండ టౌన్ : బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద నిఘా అవసరమని జిల్లా పశు వైద్య, పశువైద్య శాఖ అధికారి డాక్టర్ జివి.రమేష్ తెలిపారు. మంగళవారం ఆలగడప అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్, వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్, అవంతిపురం పశువుల సంతను సందర్శించిన ఆయన డాక్టర్ జివి.రమేష్ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసు, పశువైద్య సిబ్బందిని 24 గంటల పాటు విధుల్లో నియమించినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల ద్వారా వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా పశువుల రవాణా జరుగుతుందో లేదో పరిశీలించాలని సూచించారు. సరైన పశువైద్య ధ్రువీకరణ ప త్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. పరిమితికి మించి పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకట్‌రెడ్డి, పశువైద్యులు రమాదేవి, స్వప్న, శశికళ పాల్గొన్నారు.


