రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రెడ్ క్రాస్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జీవితా లను అంకితం చేసి ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా గుర్తింపు ప్రక్రియ కొనసాగాలన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతి జిల్లాలో పర్యటింటి ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి ఉద్యమకారుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమాచారాన్ని ప్రామాణికంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు, పోరాట స్ఫూర్తి దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిజమైన ఉద్యమకారుల ఎంపిక జరగాల్సిన అవసరం ఉందన్నారు.1969 ఉద్యమకారుల కమిటీ ఒకటి ఉన్నది ముందుగా వారికి వైద్య అవసరాల కోసం అయినా పది కోట్ల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాలను పిలిచి వారి నుంచి కూడా అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఉద్యమకారులకు ముందుగా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి, అనంతరం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఉద్యమకారులు చక్రహరి రామరాజు, గోలి అమరేందర్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, వైద్యుల సత్యనారాయణ, అంబటి నాగయ్య, వీరెల్లి చంద్రశేఖర్, ఇందూరి సాగర్, దూసరి కిరణ్‌కుమార్, పందుల సైదులు, పన్నాల గోపాల్‌రెడ్డి, పెరిక కరణ్‌జయరాజు, రమేష్, శ్రవణ్‌కుమార్, నల్ల సోమమల్లయ్య, వెంకట్రామిరెడ్డి, తోట నరసింహాచారి, సంతోష్‌రెడ్డి, చంద్రారెడ్డి, నరేంద్రబాబు, శ్రీనివాస్‌రావు, దాసోజు లలిత, లక్ష్మీనారాయణ, భీమార్జున్‌రెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు.


