నల్లగొండ : కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాల నివారణకు గస్తీలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, శ్రీనివాసరావు, డీఎస్పీ రవి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


