ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత
నల్లగొండ : రైతులకు తీరని అన్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత విమర్శించారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది, కాల్వలు తవ్వింది కాంగ్రెస్ పార్టీయేనని, దాంతో.. నల్లగొండ జిల్లానే అత్యధికంగా ధాన్యం పండుతోందన్నారు. ఆనాడు మిల్లర్లతో కుమ్మకై ్క బీఆర్‌ఎస్ నేతలు దోపిడీకి పాల్పడితే నేడు వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌లో మంత్రులుగా పని చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఉద్యమకారులా అని ప్రశ్నించారు. జిల్లాలో భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి ఎక్కడ ఉద్యమం చేసారని నిలదీశారు. చిలుకపలుకులు పలుకుతున్న ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు దొంగ ఎన్‌కౌంటర్లు చేసి తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు.


