యోగా, వ్యాయామంతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగా, వ్యాయామంతో ఆరోగ్యం

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

నల్లగొండ టూటౌన్‌ : రోజూ యోగా, వ్యాయామంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని డాక్టర్స్‌ కాలనీలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. వివిధ పనులు చేయడం ద్వారా శరీరం అలసటకు గురవుతుందని, యోగా చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. అనంతరం 2కే రన్‌ను ప్రారంభించి కలెక్టర్‌ కూడా రన్నింగ్‌ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్‌అలీ, మున్సిపల్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement