మిర్యాలగూడ : ఫోన్ చేసిన నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం వాహన సౌకర్యం మాత్రమే కాకుండా ఆస్పత్రికి చేరుకునేలోపు అంబులెన్స్‌లో అవసరమైన వైద్యచికిత్స అందించి ప్రాణాపాయాన్ని తప్పిస్తున్నారు. గురువారం అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం సందర్భంగా వారి సేవలపై ప్రత్యేక కథనం.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా 128 మంది సిబ్బంది
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 28 ‘108’ అంబులెన్స్ వాహనాలు షిప్టుల వారీగా 24గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఒక్కో వాహనంలో నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 128 మంది ఈఎంటీ, టెక్నీషియన్, ఫైలెట్‌లు పని చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, గర్భిణులు, అత్యవసర సమయంలో వైద్య సేవలు అవసరం ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు.
ఏడాదిలో 33,671 కేసులు
జిల్లాలో 2025 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి వరకు 108 అంబులెన్స్ వాహనాల ద్వారా 33,671 కేసులను టేకప్ చేశారు. ఇందులో కేటగిరీల వారీగా రోడ్డు ప్రమాదాలు 4971, పాయిజన్ కేసులు 1459, గర్భిణుల కేసులు 3946, అపస్మారక స్థితిలో ఉన్న బాధితులు 2179, కడుపునొప్పి 4632, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 2322, గుండె సంబంధిత కేసులు 1865, ఆత్మహత్య కేసులు 871 ఉన్నాయి.
ఫ లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్న 108 అంబులెన్స్ వాహనాలు
ఫ ఫోన్ చేసిన నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను
ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
నేడు అత్యవసర వైద్య
సాంకేతిక నిపుణుల దినోత్సవం


