అటెండర్‌ నుంచి తహసీల్దార్‌గా.. | - | Sakshi
Sakshi News home page

అటెండర్‌ నుంచి తహసీల్దార్‌గా..

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

నడిగూడెం : తొలిసారి అటెండర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కార్యాలయానికే తహసీల్దార్‌గా విధుల్లో చేరారు అనంతగిరి మండలం రాగాపురం గ్రామానికి చెందిన సోంపంగు సూరయ్య. ఆయన కారుణ్య నియామకం కింద 1995 జూన్‌లో నడిగూడెం తహసీల్దారు కార్యాలయంలో అటెండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సర్వీస్‌ ఆధారంగా 2007లో జూనియర్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. తిరిగి 2011లో ఆర్‌ఐగా ప్రమోషన్‌ రాగా.. 2013 వరకు అదే కార్యాలయంలో విధులు నిర్వహించారు. అదే సంవత్సరం చిలుకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ వచ్చింది. 2017 వరకు అక్కడే పనిచేశారు. అదేవిధంగా 2017 నుంచి 2018 వరకు మఠంపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా, 2018 నుంచి 2021 వరకు కోదాడ డిప్యూటీ తహసీల్దార్‌గా, 2022 నుంచి 2024 వరకు మోతె డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. 2024లో తహసీల్దార్‌గా ప్రమోషన్‌ వచ్చింది. ఈక్రమంలో 2026 మార్చి వరకు చింతలపాలెం తహసీల్దారుగా పని చేశారు. తిరిగి నడిగూడెం మండలానికి తహసీల్దార్‌గా బదిలీ కావడంతో బుధవారం ఆయన విధుల్లో చేశారు. తొలిసారిగా నడిగూడెంలో అటెండర్‌గా చేరి, అదే కార్యాలయంలో తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని సోంపంగు సూరయ్య తెలిపారు.

ఫ నాడు అటెండర్‌గా ఫైళ్లు మోసిన చోటుకే తహసీల్దార్‌గా విధుల్లోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement