కలెక్టరేట్‌ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా

Jan 6 2026 7:18 AM | Updated on Jan 6 2026 7:18 AM

కలెక్టరేట్‌ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా

నల్లగొండ టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆశ వర్కర్లు డ్యూటీలకే పరిమితం కాకుండా ప్రభుత్వం నిర్వహించే అనేక రకాల పథకాలను ప్రజల దగ్గరికి చేర్చే పనిలో కూడా ఉన్నారన్నారు. అనంతరం కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరి, వెంకటమ్మ, ఏర్పుల యాదయ్య, అవుట రవీందర్‌, అనురాధ, కవిత, సైదమ్మ, స్వర్ణ, శైలు, ధనమ్మ, సుజాత, పద్మ, మంజుల, సౌజన్య, వెంకటమ్మ, విమల, పుష్పలత పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement