వెజిటబుల్.. రేటు డబుల్!
కూరగాయ తుపాన్‌కు ప్రస్తుతం
ముందు
దోస 60 80
దొండ 50 80
కాకర 50 80
బీరకాయ 60 80
గోకర 60 120
బెండకాయ 60 80
క్యాప్సికం 80 120
బీన్స్ 60 150
క్యారెట్ 60 100
మునగ 100 150
సొర 40 60
పచ్చిమిర్చి 60 60
టమాట 20 30
పది రోజుల క్రితం, ప్రస్తుతం
కూరగాయల ధరలు
నల్లగొండ టూటౌన్ : కూరగాయల ధరలు మండిపడుతున్నాయి. పది రోజుల క్రితంతో పోల్చుకుంటే రేట్లు రెట్టింపు అయ్యాయి. ఏ కూరగాయ చూసినా కిలో రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. కూరగాయల ధర.. చికెన్ రేటుకు దగ్గరగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం నల్లగొండ పరిసర ప్రాంతాల్లో వరి, పత్తి చేలతోపాటు కూరగాయల సాగుపై కూడా పడింది. తుపాన్ తరువాత కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు కూరగాయల సాగు మొదలు పెట్టినా.. అవి కాతకు రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూరగాలయల ధరలు ఎక్కువగానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.
మోంథా తుపాన్ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసే రైతులను నిండి ముంచింది. వర్షానికి ఆకుకూరలు ఎర్రబారి పోవడంతోపాటు చేలు పాయిపోయాయి. నేల మీద కాసే కూరగాయలపై మట్టి పడి పాడయ్యాయి. ఏటా ఈ సీజన్‌లో కూరగాయలు పుషల్కంగా పండుతాయి. అన్ని కూరగాయల ధరలు ఓ మోస్తారులోనే ఉంటాయి. కానీ తుపాన్ ప్రభా వంతో పంటలు దెబ్బతిని ధరలు కొండెక్కాయి.
నల్లగొండ జిల్లా కేంద్రానికి ఎక్కువగా కనగల్, మాడ్గులపల్లి, అనుముల, పెద్దవూర, గుర్రంపోడు, నకిరేకల్, కట్టంగూరు, తిప్పర్తి మండలాలకు చెందిన రైతులు కూరగాయలు పండించి ప్రకాశం బజార్ మార్కెట్‌కు తీసుకొస్తారు. కొందరు ఇక్కడి వ్యాపారులకు విక్రయిస్తారు. మరికొందరు ఉదయం సమయంలో నేరుగా వినియోగదారులకు విక్రయించి ఉపాధి పొందుతారు. ఇక్కడ రైతులు దోస, దొండ, బెండ, సొర, బీర, కాకర, గోకెర కాయ, పచ్చిమిర్చి పండిస్తారు. క్యాప్సికం, బీన్స్, క్యారెట్, మునగ, ఆలుగడ్డను హైదరాబాద్ నుంచి వ్యాపారులు తెప్పించి విక్రయిస్తారు. కానీ రాష్ట్రమంతా భారీ వర్షాలు కురవడంతో కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం పాడైయిపోయాయి. దాంతో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. పంటలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. తాము హోల్‌సేల్‌లో రిటైల్‌గా అమ్మే ధరలో రూ.10 తగ్గించి అమ్ముతున్నామని పేర్కొంటున్నారు.
కొండెక్కిన కూరగాయల ధరలు
ఫ మోంథా తుపాన్‌తో దెబ్బతిన్న పంటలు
ఫ మార్కెట్‌కు తగ్గిన కూరగాయల రాక
ఫ ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
వెజిటబుల్.. రేటు డబుల్!


