తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్‌లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్‌లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్‌గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్‌గా వినియోగిస్తుంటారు.


