విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి
నకిరేకల్ : భారత విప్లవోద్యమానికి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చుక్కాని అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్‌కుమార్ అన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాట నిర్మాత, భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను నకిరేకల్‌లో యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం తపించిన విప్లవ సిద్ధాంత కర్త చండ్ర పుల్లారెడ్డి అని గుర్తు చేశారు. 14 రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర కీలకమన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బీవీ చారి, జిల్లా నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, బోమ్మడి నగేష్, కనుకుంట్ల సైదులు, గజ్జి రవి, గద్దపాటి శంకర్, మామిడి ఎల్లయ్య, అంబటి నర్సయ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, జానయ్య, వేముల శంకర్, రావుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


