ఓటమి.. గెలుపునకు నాంది
హాలియా : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతి ఓటమి గెలుపునకు నాంది అవుతుందని మహాత్మా జ్యోతిరావుపూలే (ఎంజేపీ) గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ (ఆర్‌సీఓ) స్వప్న తెలిపారు. నాగార్జునసాగర్ గురుకులంలో మూడు రోజులుగా సాగుతున్న జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గురుకులాల్లో విద్యతో పాటు ఆటలు, ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ తరి రాములు, సాగర్ గురుకులం ప్రిన్సిపాల్ రవికుమార్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో అనంతారం గురుకులం ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. వాలీబాల్, చెస్, 1500 మీటర్ల పరుగు పందెం, షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, 800 మీటర్ల పరుగు పందెం, 400 మీటర్ల పరుగుపందెంలో అనంతారం విద్యార్థులు విజయం సాధించారు. కబడ్డీలో అనంతారం ప్రథమ బహుమతి, నేరేడుచర్ల ద్వితీయ బహుమతి సాధించాయి. ఖోఖోలో కోల్‌ముంతలపహాడ్ మొదటిస్థానంలో నిలవగా, నాగార్జునసాగర్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఎంజేపీ గురుకులాల ఆర్‌సీఓ స్వప్న
ముగిసిన జిల్లాస్థాయి క్రీడాపోటీలు
ఓటమి.. గెలుపునకు నాంది


