నేడు లీగల్‌ సర్వీస్‌ డే | - | Sakshi
Sakshi News home page

నేడు లీగల్‌ సర్వీస్‌ డే

Nov 9 2025 7:37 AM | Updated on Nov 9 2025 7:39 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం లీగల్‌ సర్వీస్‌ డే నిర్వహించనున్నట్లు సెక్రటరీ పి.పురుషోత్తంరావు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సాంకేతిక లోపంతో ఆగిన చార్జింగ్‌ బస్‌

నార్కట్‌పల్లి : నల్లగొండ డిపోనకు చెందిన చార్జింగ్‌ బస్‌ శనివారం ఉదయం నల్లగొండ నుంచి భువనగిరికి వెళ్తున్న సమయంలో నార్కట్‌పల్లి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో హైదరాబాద్‌ నుంచి నల్లగొండకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నార్కట్‌పల్లి చెందిన వాకర్స్‌, ప్రయాణికులు ఆగిన బస్‌ను నెట్టడంతో బస్ట్‌ స్టార్ట్‌ అయి యథావిధిగా వెళ్లిపోయింది.

యాదగిరి క్షేత్రంలో

సుదర్శన హోమం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. వేకువజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. గర్భాలయంలో కొలువైన స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నిత్యతిరుకల్యాణ వేడుక ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

ఆకట్టుకున్న

నృత్య ప్రదర్శన

భువనగిరి : పట్టణ పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం సాంస్కృతిక శాఖ నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన వీణఅయ్యర్‌ బృందం కళాకారిణుల కూచిపూడి నృత్యం కనువిందు చేసింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడంతో పాటు చెరువులో బోటింగ్‌ చేసి ఉల్లాసంగా గడిపారు.

నిండుకుండలా

పులిచింతల

మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండుకుండలా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45 టీఎంసీలు కాగా శనివారం 44.897 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ప్లో 34,274 క్యూసెక్యులు ఉండగా ప్రాజెక్టు నుంచి 58,736 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్లాంట్‌ వద్ద 105 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు.

నేడు లీగల్‌ సర్వీస్‌ డే1
1/3

నేడు లీగల్‌ సర్వీస్‌ డే

నేడు లీగల్‌ సర్వీస్‌ డే2
2/3

నేడు లీగల్‌ సర్వీస్‌ డే

నేడు లీగల్‌ సర్వీస్‌ డే3
3/3

నేడు లీగల్‌ సర్వీస్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement