ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు బుధవారం ‘మహిళా వ్యాపారవేత్తలు – నైపుణ్యాల పెంపు – చిన్న తరహా సమూహాల నుంచి సుస్థిరమైన వ్యాపారాలు’ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అలీఫ్ ఇంక్యుబేషన్ సెంటర్ మేనేజర్ నవీన్‌కృష్ణ మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన భారతదేశంలో వ్యాపారానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు పరిశీలన ద్వారా సమగ్రమైన పరిశోధనతో అవకాశాలను పొందవచ్చని సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సృజనశక్తితో సమాజ హితమైన ప్రయోగాలతో ఉత్పత్తులను సమాజానికి అందించడం ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, వెంకటేష్, సీహెచ్.సుధారాణి, సాంబశివరావు, జయంతి, మౌనిక, మారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ


